రాయచోటి : జిల్లాలో ఇప్పటికే పంపిణీ పూర్తి చేసిన జగనన్న విద్యా కానుక బయో మెట్రిక్ ఆథెంటిఫికేషన్ వారంలోపు వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జగనన్న విద్యా కానుక, స్కూల్ డ్రాప్‌ఔట్స్, 6, 8, 10 తరగతుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంపు, పాఠశాలల్లో చేపట్టిన నాడు-నేడు పనుల అంశాలపై విద్యాశాఖ ఎంఇఒలు, సమగ్ర శిక్ష అధికారులు, మండల ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరికం కార ణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అమ్మఒడితోపాటు జగనన్న విద్యా కాను కలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారని చెప్పారు. ఇందుకు సంబంధించి జగనన్న విద్యా కానుకలు అందజేసిన 1,54,789 మంది పిల్లల బయోమెట్రిక్ ఆథెం టికేషను వారంలోపు వందశాతం పూర్తి చేయాలని ఎంఇఒలను ఆదేశించారు. జిల్లాలోని వాలంటీర్లను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. వాలంటీర్లందరూ ప్రతి స్కూలుకు వెళ్లి బయోమెట్రిక్ ఆథెంటికేషను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో డ్రాప్‌ఔట్స్ జీరో శాతానికి తీసుకురావాలన్నారు. 5 నుంచి 6, 7 నుంచి 8, 9నుంచి 10 తరగతులకు వెళ్లిన విద్యా ర్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిఇఒ, ఎంఇఒలను ఆదేశించారు. వాలంటీర్లు సంక్షేమ , విద్య శాఖ అసిస్టెంట్లు, సిఆర్‌పిలందరూ ఎన్‌రో ల్‌మెంట్ రేషియోను తప్పనిసరిగా పూర్తి చేయాల న్నారు. ఈ అంశంపై అన్ని ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలల హెచ్‌ఎంలతో సోమ, మంగళవారాలలో సమావేశం నిర్వహించి తగు సూచనలు జారీ చేయాలని డిఇఒలకు సూఇచంచారు. 10 తరవాత విద్యార్థులు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటిఐ, వత్తి విద్య కోర్సులు తదితరాలలో చేరి ఉంటారని వారందరూ వివరాలను ఆన్‌లైన్‌లో పొందు పరచాలని ఆర్‌ఐఒకు సూచించారు. పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులలో పది కాంపోనెంట్స్ పనులను జూలై 31 లోగా పూర్తి చేసేందుకు కషి చేయాలన్నారు. పనులకు సంబంధించిన ఫొటో అప్‌లోడ్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో నీటి వసతితోపాటు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్స్, క్లాస్ రూమ్ రిపేర్స్, విద్యుత్ సౌకర్యం, రూఫ్ రిపైర్స్ తదితర అంశాలలో సాధించిన ప్రగతి, వెనుకబడిన మండలాలలో గల కార ణాలను సంబంధిత ఎంఇఒలు, మండల ఇంజి నీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాడు నేడు పనులలో మండల ఇంజినీరింగ్ అధి కారులు ఎక్కడైనా సరిగా స్పందించకుంటే కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందజే యాలని ఎంఇఒలు, హెచ్‌ఎం లకు సూచించారు. అనంతరం వివిధ అంశాలపై సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. సమీక్ష సమావేశంలో డిఇఒ పురుషోత్తం, ఆర్‌ఐఒ కష్ణయ్య, జిల్లా సమగ్ర శిక్ష సిఎంఒ కరుణాకర్ పాల్గొన్నారు.సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గిరీష










