Dec 18,2022 23:35

నేత్ర వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న నమ్మి రమణ

ప్రజాశక్తి -గాజువాక : స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ సిఐటియు, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గంగవరం చావిడి వద్ద ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, సిఐటియు కేవలం కార్మిక సమస్యలకే పరిమితం కాకుండా ప్రజా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. యూనియన్‌ అధ్యక్షులు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, మానవ శరీరంలో అన్ని అవయవాల కంటే కళ్లు ముఖ్యమైనవి, నేడు టీవీలు, సెల్‌ఫోన్ల ప్రభావంతో చిన్నారులు సైతం దృష్టిలోపం సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కంటి వైద్యశిబిరంలో వంది మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించగా, దృష్టిలోపమున్న వారికి సాయి ఆప్టికల్స్‌ ఉచిత మందులతోపాటు సగం ధరకే కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు. యు.సోమేష్‌, పి మసేను, వై శ్యామ్‌సుందర్‌, కె మహేష్‌, వి సోమేష్‌, పి పోలరాజు, వి ఎల్లాజీ, కె శివ, ఎరిపిల్లి ఎల్లాజీ పాల్గొన్నారు