ప్రజాశక్తి- దేవనకొండ
తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో నెలకొన్న కరువును దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కూలీలు వలసలు వెళ్లకుండా కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ మండల కార్యదర్శి ఎం.నరసరావు, వ్యకాస మండల అధ్యక్షులు సి.కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం వ్యకాస ఆధ్వర్యంలో ఎంపిడిఒ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యవసాయ కూలీల పిల్లలు చదువుకునేందుకు వీలుగా సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం, పంటల బీమా పూర్తిస్థాయి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు. వ్యకాస మండల నాయకులు సుల్తాన్, రామాంజనేయులు, బాష, కోమేష్, రామాంజి, మధు, రవి, నాగేంద్ర, కాశీపతి, ఆనంద్, నరేష్, భాస్కర్ పాల్గొన్నారు.