సుప్రజకు స్వీటు తినిపిస్తున్న తల్లిదండ్రులు
ప్రజాశక్తి-మార్టూరు రూరల్ / పంగులూరు: మండల పరిధిలోని వలపర్ల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని పోలిశెట్టి సుప్రజ 593 మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్‌గా నిలిచింది. 149 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 142 మంది ఉత్తీర్ణులైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తెనాలి ఇన్‌ఛార్జి డిప్యూటీ డీఈఓ మన్నెం నిర్మల రూబెన్ తెలిపారు. ఈ విద్యార్థిని పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన వంశీకృష్ణ, అంజనీకుమారిల పుత్రిక. మండలంలోని కోనంకి, మార్టూరు, ద్రోణాదుల, కోలలపూడి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉప్పలపాటి యు పురంధరేశ్వరి 560, దివ్యశ్రీ 551, సాత్విక్ 547, కుంచపు సంధ్య 547 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.










