సర్టిఫికెట్లుఅందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ప్రజలకు సేవలందిస్తున్న వాలంటీర్లపై జనసేన నాయకులు, మాజీ సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసిపి రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి ఖండించారు. శనివారం తోటపల్లిగూడూరు మండలం పోట్లపూడిలో జగనన్న సురక్ష శిబిరం జరిగింది. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తమ సేవలతో వలంటీర్లు ప్రజల మనస్సులను గెలుచుకున్నరన్నారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు అభినందనీయమని సుధీర్ రెడ్డి కొనియాడారు. జెడ్పిటిసి శేషమ్మ, వ్యవసాయ సలహా మండలి చైర్పర్సన్ ప్రసూనా, ఎంపీటీసీ శీనయ్య, మండల వైస్ ప్రెసిడెంట్ ఇందిరమ్మ, ఎంపీడీవో హేమలత, తహసిల్దార్ హమీద్, ఈవోపీఆర్ రెడ్డి నారాయణరెడ్డి, ఆర్‌ఐ సునీల్ రెడ్డి ఉన్నారు.










