Feb 27,2023 23:58

వలలో చిక్కిన భారీ చేప


ప్రజాశక్తి-యస్‌.రాయవరం:మండలంలోని మత్స్యకార గ్రామమైన బంగారమ్మపాలెం సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సోమవారం తెల్లవారుఝామున సుమారు 1500 కేజీల బరువైన ముక్కుడు టేకు చేప వలకు చిక్కింది. ఇటువంటి భారీ చేపలు అరుదుగా వలకు చిక్కుతాయని, ఈ చేప రెక్కలతో కొడితే మనిషికి తీవ్రగాయాలు అవుతాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఈ భారీ టేకు చేపను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలి వచ్చారు.