భీమడోలు : ఏలూరుకు చెందిన వైఎంహెచ్‌ఎ, ఎవిఆర్ విజ్ఞాన వేదిక సంయుక్తంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీలలో గుండుగొలనుకు చెందిన శ్రీవిద్యాలయ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను, బహుమతులను సాధించిన విద్యార్థులు కంచర్ల రాజేష్, ఎస్.అలేఖ్య, వి.దుర్గాప్రసాద్, ఆర్‌ఎస్‌టి ప్రకీర్తిక, ఎం.యశోద, ఎం.శరణ్య, బి.ఆశ్రిత, టి.మౌనిక, జి.బ్యూలాలను పాఠశాల యాజమాన్యం గుండుగొలనులో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు.










