ప్రజాశక్తి-వాకాడు: వాకాడు తాసిల్దార్ గా పనిచేస్తూ అనారోగ్య కారణంగా సెలవుపై వెళ్లిన జీ.శ్రీనివాసులు శుక్రవారం ఉదయం ఐదు గంటలకు నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ తన స్వగృహం నందు మృతి చెందారు. వాకాడు నుంచి ప్రస్తుత తాసిల్దార్ గా పనిచేస్తున్న ఎస్వీ. నరసింహారావు, డిటి సారంగపాణి, వాకాడు మండలం రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు సర్వేయర్లు అటెండర్లు ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరు గతంలో నాయుడుపేట చిట్టమూరు దొరవారిసత్రం మండలాల్లో తాసిల్దారుగా విధులు నిర్వర్తించారు.










