Jul 15,2023 21:14

మాట్లాడుతున్న అంబవరం ప్రభాకర్‌రెడ్డి

కడప ప్రతినిధి : ప్రతి ఉపాధ్యాయుడూ ప్రశస్త్‌ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకొని అందులో విభిన్న ప్రతిభవంతుల వివరాలను నమోదు చేయాలని సమగ్ర శిక్ష పథకాధికారి డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని మండల వనరుల కార్యాలయంలో ఐఈఆర్‌పిలకు ప్రశస్త్‌ యాప్‌ నమోదు పైన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల వివరాలను యూడైస్‌ అప్లోడ్‌ చేయాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల గుర్తింపుకై సోమవారంనుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని, ప్రతి ఐఇఆర్‌పి ఫేషియల్‌ రికగ్నిషన్లో అటెండెన్స్‌ నమోదు చేయాలన్నారు. సహిత విద్యా సమన్వయకర్త మిట్టాకేశవరెడ్డి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులను పాఠశాలల్లో చేర్పించాలని, వారి చేరికను ఏ ప్రధానోపాధ్యాయుడు నిరాకరించకూడదని అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను గురించి వివరించారు. బడి బయట ఉన్న విభిన్న ప్రతిభావంతులను గుర్తించి సమీప పాఠశాలలో చేర్పించడం యుడైస్లో నమోదు చేయించడం ప్రతి రిసోర్స్‌ పర్సన్‌ యొక్క బాధ్యతగా భావించాలన్నారు. సహాయక సహిత విద్యా సమన్వయకర్త రమణమూర్తి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల చేరికను బట్టి జిల్లాకు బడ్జెట్‌ కేటాయించబడుతుందన్నారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా సహిత విద్యా సమన్వయకర్త జనార్దన్‌ రిసోర్స్‌ పర్సన్లు తామడిగిన వివరాలను సకాలంలో కార్యాలయానికి అందించేలా సిద్ధంగా ఉండాలన్నారు. కోటయ్య సేవలు మరువలేనివి... విభిన్న ప్రతిభావంతుల సేవలో దాదాపు 20 ఏళ్లకు పైగా విధులు నిర్వహించి విరమణ చేసిన విభిన్న ప్రతిభావంతుల రిసోర్స్‌ పర్సన్‌ కోటయ్య సేవలు అపూర్వమైనవని అంబవరం ప్రభాకర్‌ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్‌ ఈడీ డాక్టర్‌ వల్లూరు బ్రహ్మయ్య పేర్కొన్నారు. మండల వనరుల కేంద్రంలో కోటయ్య విరమణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వారు మాట్లాడుతూ కోటయ్య విధి నిర్వహణలో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక విద్యతోపాటు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. చాపాడు, బ్రహ్మంగారిమఠం, మైదుకూరు తదితర ప్రాంతాలలో విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించడంతోపాటు వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చేయడంలో విశేష కషి చేశారని కొనియాడారు.