వివోఏలకు హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. ఏసురత్నం
ప్రజాశక్తి - నంద్యాల రూరల్
వీవోఎ లా ఉపాధిని దెబ్బతీసే మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కిలర్ ను రద్దుచేసి వీవోఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వి. ఏసు రత్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వి వో ఏ ల కు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని వి వో ఏ యూనియన్ సీఐటీయూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం స్థానిక బొమ్మల సత్రం సెంటర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం డి ఆర్ డి ఏ పీడీ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహించారు. వైయస్సార్ క్రాంతి పధం జిల్లా పి డి కార్యాలయం ముందు జరిగిన ధర్నాకు వి వో ఎ ల సంఘం జిల్లా అధ్యక్షుడు కె. సోమన్న అధ్యక్షత వహించగా ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. యేసురత్నం ఏ పీ వి వో ఏ ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి ఏ, తిరుపతయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి వి. బాల వెంకట్ లు పాల్గొని మాట్లాడుతూ వి వో ఎ లా కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వి వో ఎ లా మెర్జ్ ను వెంటనే ఆపాలని వీవోఎ లా ఉపాధిని దెబ్బతీసే మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కిలర్ ను వెంటనే రద్దుచేసి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని, వి వో ఏ లపై రాజకీయ వేధింపులు ఆపాలని, డిమాండ్ చేశారు ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చకుంటే వి వో ఏ లు చలో విజయవాడకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు, ఈ ధర్నా కార్యక్రమంలో వి వో ఏ ల సంఘం జిల్లా నాయకులు భాస్కర్, శంకరయ్య, పుల్లయ్య, అలిపిర, రామ్ మద్దిలేటి, శ్రీను, తిరుపతయ్య, నాగవర్ధన్, అప్ప లు నాయకత్వం వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో వివోఏలు తదితరులు పాల్గొన్నారు.










