ప్రజాశక్తి-సత్తెనపల్లి : తీవ్ర వివక్షతకు గురై ఆ వివక్షతపైనే నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పోరాడారని ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య అన్నారు. బుధ వారం స్థానిక పుతుంబాక భవన్‌లో గుర్రం జాషువా 128వ జయంతి సభనను సుందరయ్య విజ్ఞాన కేంద్రం కన్వీనర్ పి.సూర్యవప్రకాశరావు అధ్యక్షత వహిం చారు. ముఖ్యఅతిథిగా హాజరైన పాముల య్య మాట్లాడుతూ సమాజంలో ఆవహించి ఉన్న వివక్షతను రూపుమాపేందుకు జాషువా అనేక రచనలు చేశారని, 'గబ్బిలం' అందులో ఒకటని, బాగా ప్రాచూ ర్యమూ పొందిందని చెప్పారు. ఆనాడు తీవ్ర వివక్షతకు గురైన జాషువా పంచ కావ్యాలు చదవాలని నిర్ణయించుకుంటే అప్పటి అగ్రవర్ణాల వారు పంచ కావ్యాలు చదవడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధిం చారని, ఆయినా పాడుబడ్డ మసీదును కేంద్రంగా చేసుకుని చదివారని గుర్తు చేశారు. జాషువా రచించిన అనేక కా వ్యాలు పద్యాలు, సత్యహరిచంద్ర నాటకం లోని పద్యాలను ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.నాగేశ్వరరావు, టి.పెద్దిరాజు, కళాకారులు కె.శివదుర్గా రావు, సిహెచ్. నాగమల్లేశ్వరరావు, కె.సుబ్బారావు, ప్రసాదు పాడి వినిపించారు. తొలుత గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంటోనీ, కె.నాగేశ్వరరావు, జి.మస్తాన్‌రావు, కె.మాధవి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - అమరావతి : విశ్వనరుడు, మహాకవి గుర్రం జాషువా 128వ జయంతి సభ అమరావతి తల్లం బ్రహ్మయ్య స్మార్క భవనంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజాసంఘాల కన్వీనర్ బి.సూరిబాబు మాట్లాడుతూ సమాజంలో ప్రతి మనిషినీ గౌరవించాలని, మనుషుల మధ్య కుల, ఆర్థిక అసమానతో లేని సమాజం కావాలని జాషువా కోరుకున్నారని చెప్పారు. శ్రమజీవుల పడుతున్న కష్టాల గురించి, కుల వివక్షత అంటరానితనం రూపుమాపటం కోసం సాహిత్యాన్ని రాశారన్నారు. జాషువా తన జీవిత కాలంలో అనేక అవమానాలకు, వివక్షకు గురయ్యారని గుర్తు చేశారు. మనుషులంతా ఒకటిగా జీవించాలని కాంక్షించారని చెప్పారు. గబ్బిలం, ఫిరదౌసి రచనలు నేటికీ సాహిత్యపురులకు స్ఫూర్తిగా ఉన్నాయని చెప్పారు. స్త్రీలు వంటింటి పరిమితం కాకుండా పురుషులతో పాటు సమానత్వంగా గుర్తించినప్పుడే దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని, స్త్రీ స్వేచ్ఛ, హక్కుల కోసం జాషువా కృషి చేశారని అన్నారు. నేడు పాలక పార్టీలు ప్రజల మధ్య చీలికలు తెస్తున్నాయని, మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నాయని విమర్శించారు. కుల వివక్ష నేటికీ కొనసాగుతోందని అన్నారు. ఈ జాఢ్యాలకు వ్యతిరేకంగా జాషువా స్ఫూర్తితో పోరాడాలని, జాషువా సాహిత్యాన్ని అధ్యయం చేయాలని అన్నారు. సభకు కెవిపిఎస్ మండల కార్యదర్శి ఎస్.రాజుకుమార్ అధ్యక్షత వహించగా ఎస్‌కె.రఫీ, ఎం.సుబ్రహ్మణ్యం, నవీన్, వెంకటేశ్వరరాజు, పి.సత్యనారాయణ, మోహిద్దీన్‌వలి పాల్గొన్నారు. తొలుత జాషువా చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.










