Jul 25,2023 23:37

సత్తెనపల్లి: వివక్షపై అక్షరంతో అసమాన యుద్ధం చేసిన కవి కోకిల గుర్రం జాషువా అని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ పొట్టి సూర్యప్రకాశరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పుతుంబాక భవన్‌ లో జరిగిన గుర్రం జాషువా 52వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా ఆయన అనేక కవితలు,రచనలు చేసి అణగారిన వర్గాలలో చైతన్యాన్ని రగిలించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు అనుముల వీరబ్రహ్మం, రొంపిచర్ల పురుషోత్తం, సెగ్గెం వెంకటేశ్వర్లు,ఏడుకొండలు, గుంటుపల్లి ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.