Aug 14,2023 23:52

నాయకులతో కలిసి ఫిర్యాదు చేస్తున్న సర్పంచ్‌ చెల్లమ్మ

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి
పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అండదండలతో స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు తన పట్ల వివక్ష చూపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కొండేవరం సర్పంచ్‌ వేమగిరి చెల్లమ్మ సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చెల్లమ్మ మాట్లాడారు. దళిత మహిళను కావడం, టిడిపి బలపర్చిన అభ్యర్థి కావడంతో వేధింపులకు దిగుతున్నారన్నారు. లేనిపోని అవినీతి ఆరోపణలు చేసి చెక్‌ పవర్‌ని రద్దు చేశారన్నారు. సచివాలయ భవనాలు నిర్మాణంలో, పంచాయతీ నుంచి నిధులు ఇవ్వలేదని ఎంపిటిసి భర్త అధికార పార్టీ అండదండలంతో వివిధ రకాల ఒత్తిళ్లకు గురిచేస్తున్నారన్నారు. అవినీతి ఆరోపణ లేకున్నా విచారణ లేకుండా చెక్‌ పవర్‌ను రద్దు చేయడం ఎంతవరకూ సమంజసమని ఆమె ప్రశ్నించింది. నిజనిర్ధారణ వేసి తనకు న్యాయం చేయాలని కోరింది. ఆమె వెంట టిడిపి మండల అధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, ఎంపిటిసి సుభ్యులు దుల్ల సత్తిబాబు, వేమగిరి రాంబాబు, జడ్‌పిటిసి మాజీ సభ్యులు మడికి ప్రసాద్‌ పాల్గొన్నారు.