Nov 17,2022 23:53

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, వివిధ శాఖల అధికారులు

ప్రజాశక్తి-అనకాపల్లి : స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైయస్సార్‌ చేయూత మహిళా మార్ట్‌, వి.మాడుగుల హల్వా బ్రాండ్‌, విస్తరాకుల తయారీ యూనిట్‌, ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీ కేంద్రాల్లో కార్మికుల సమస్యలు, కంచు వస్తువుల తయారీ యూనిట్‌, సేంద్రియ బెల్లం తయారీ యూనిట్ల విస్తరణ, కోల్డ్‌ స్టోరేజీ కలెక్షన్ల సెంటర్లు ఏర్పాటు, పీఎంఈజీపి, పిఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఈ ద్వారా యూనిట్ల ఏర్పాటు, చేయూత ఆసరా లబ్ధిదారుల జీవనోపాధి మెరుగుదలకు చర్యలు, రైతు ఉత్పత్తి కేంద్రాల అభ్యున్నతి తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి సీతాపతి, జిల్లా వ్యవసాయ అధికారిని లీలావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.