Feb 24,2023 00:11

అప్పారావును సత్కరిస్తున్న బూడి ముత్యాలనాయుడు

ప్రజాశక్తి -పాయకరావుపేట:వైసిపి పబ్లిక్‌ వింగ్‌ జిల్లా అధ్యక్షుడిగా పాయకరావుపేట పట్టణానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకుడు, ప్రస్తుతం వైసీపీ పట్టణ అధ్యక్షుడిగా పని చేస్తున్న దగ్గపల్లి సాయిబాబాను నియమించారు. ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.
కోటవురట్ల:అనకాపల్లి జిల్లా వైసీపీ బీసీ సెల్‌ అధ్యక్షునిగా కోటవురట్ల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పైలా రమేష్‌ను నియమిస్తూ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ, బీసీ సంఘ నాయకుల సమస్యలతో పాటు పార్టీ అభివృద్ధికి పని చేస్తానని తెలిపారు. గతంలో మండల వైసిపి అధ్యక్షునిగా దీర్ఘకాలం ఆయన పని చేశారు. జిల్లా పదవి దక్కడంతో పలు బీసీ సంఘాల నాయకులతో పాటు వైసిపి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
అప్పారావుకు సత్కారం
ప్రజాశక్తి-చీడికాడ: చీడికాడ మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఎర్ర అప్పారావును అనకాపల్లి జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా నియామకం పట్ల వైసీపీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అప్పారావు సేవలను గుర్తించి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా నియమించడం హర్షించిదగ్గ విషయమని నాయకులు, కార్యకర్తలు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం ఎర్ర అప్పారావుని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తన స్వగృహంలో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురచా జయమ్మ, పార్టీ అధ్యక్షులు రాజబాబు, యువజన అధ్యక్షుడు స్వామి నాయుడు, సీనియర్‌ నాయకులు సుంకర శ్రీను, డైరీ డైరెక్టర్‌ ఎస్‌.సూర్యనారాయణ, బూడి యువసేన కార్యకర్తలు పాల్గొన్నారు.