Oct 26,2022 22:50

కబడ్డీ ఆడుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి - ఆరిలోవ : స్కూలు గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వివిధ ఆటల పోటీల్లో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు అండర్‌14,17 విభాగంలో ఎంపికలు చేపడతారు. బుధవారం నియోజకవర్గంలోని 18 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నుంచి 250 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. వాలీబాల్‌, త్రోబాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోకో, టెన్నీ కాయిడ్‌, బాల్‌ బాడ్మింటన్‌, యోగ, అథలెట్స్‌ల్లో విద్యార్ధులను ఎంపిక చేసారు. ఎంపికైన విద్యార్ధులను ఈనెల 30న జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారు. పోటీలను తోటగరువు హెచ్‌ఎం జిడికె భవాని, ఎస్‌జిఎఫ్‌ సభ్యులు పర్యవేక్షించారు.
గాజువాక : కణితి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి.. వాలీబాల్‌, త్రో బాల్‌, ఖోఖో ఇతర పోటీలను ప్రధానోపాధ్యాయులు బి సూర్యప్రకాశరావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.