Feb 14,2023 23:44

మాట్లాడుతున్న టిడిపి నాయకులు తాతయ్యబాబు

ప్రజాశక్తి-వడ్డాది : వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారులను శిక్షించాలని టిడిపి చోడవరం నియోజకవర్గం ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు డిమాండ్‌ చేశారు. బుచ్చయ్యపేట మండలం పడ్డాది టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగనాసుర రక్త చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన సొంత చిన్నాన్న వివేక హత్య కేసును కూడా రాజకీయం చేసి జగన్‌ లబ్ధి పొందారంటే అతని నేరచరిత్ర ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు. చంద్రబాబుపై దుష్ప్రచారం చేసిన వ్యక్తులకు సిబిఐ విచారణతో తాడేపల్లి గుట్టురట్టు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో తెలుగు యువత అధ్యక్షులు సిరిగిరి శెట్టి శ్రీరామూర్తి మాజీ ఎంపీటీసీ గొన్నాబత్తుల శ్రీనివాసరావు, ఎ.కనకం పాల్గొన్నారు.