ప్రజాశక్తి - వన్‌టౌన్ : వివేకా గుండెపోటు డ్రామాకు తెర పడిందని, వివేకానందరెడ్డిని అవినాష్‌రెడ్డి హత్య చేయించాడని కేసులో నిందితులు సీబీఐకి చెప్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఈ హత్యలో జగన్‌కు కూడా పాత్ర ఉందని ఆరోపించారు. వివేకా హత్యలో విజయసాయి రెడ్డిని కూడా సిబిఐ ప్రశ్నించాలని, వివేకా గుండెపోటుతో చనిపోయాడని ఎవరు చెప్తే విజయసాయి రెడ్డి చెప్పారో విచారణ చేయాలని అన్నారు. వివేకా రెండో పెళ్లి వివాదంతోనే హత్య జరిగిందని మాట్లాడడం సిగ్గు చేటన్నారు. వివేకానందరెడ్డిని సొంత బంధువులే పైశాచికంగా హత్య చేసి టిడిపిపై నింద వేశారని విమర్శించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు సాదరబోయిన ఏడుకొండలు, కామా దేవరాజు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, గణపా రాము, పత్తి నాగేశ్వరరావు, ఈగల సాంబ, పేరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










