- అత్తింటి వేధింపులే కారణమంటూ లేఖ
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రజాశక్తి - చీరాల
అత్త, మామ, బావ వేధింపులు తాళలేక మనస్థాపానికి గురైన ఓ ఓ వివాహిత ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలోని నవాబ్ పేటలో చోటుచేసుకుంది. నవాబ్ పేటకు చెందిన ఉమారాణి, ఉమా మహేశ్వరరావులకు 10సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే వీరికి పిల్లలు పుట్టకపోవడంతో ఒక బాబుని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. ఆస్తి ఎక్కడ ఆ పిల్లవాడికి చెందుతుందోనని ఉమారాణి, ఉమామహేశ్వరరావు దంపతులను భర్త తల్లిదండ్రులు, సోదరుడు గాంధీ, కృష్ణవేణి, లక్ష్మీనారాయణ మృతురాలు ఉమారాణిని మానసికంగా చిత్రహింసలకు గురి చేశారంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. తన ఆత్మహత్యకు అత్త, మామ, బావ వేధింపులే కారణమని మృతురాలు ఉమారాణి సూసైడ్ లేఖ రాసింది. సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.










