Oct 25,2023 22:05

వివాహ కుటుంబానికి అందిస్తున్న భోజనం

జగ్గయ్యపేట: రాజన్న ఉచిత భోజన కార్యక్రమంలో భాగంగా నిరుపేదల వివాహానికి కూడా భోజనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను చేపట్టారు. పట్టణంలోని విలియంపేటకు చెందిన దారెల్లి రమేష్‌ కుమార్తె వివాహం సంద్భంగా సామినేని ఉదయభానుకు సమాచారం అందించారు. ఈ మేరకు నిర్వాహకులు జివిడి ప్రసాద్‌, పిఎ ప్రసాద్‌లతో మాట్లాడి రాజన్న క్యాంటీన్లో దాదాపు 100 మందికి భోజనాలు వండించి అందజేశారు.