Jun 02,2023 19:20

వేడుకల్లో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి - పెద్దకడబూరు
పెద్దకడబూరు గ్రామానికి చెందిన హెచ్‌.మురవాణి గ్రామ సచివాలయం-1లో పని చేస్తున్న వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కెంచాలి శ్రీకర్‌ వివాహం శుక్రవారం ఎమ్మిగనూరులోని రాయల్‌ ఫంక్షన్‌ హాలులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టిడిపి నేత రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్‌ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దివకర్‌ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు రమాకాంత్‌ రెడ్డి, దివాకర్‌ రెడ్డిని పూలమాలతో ఘనంగా సన్మానించారు. టిడిపి నాయకులు నరసన్న, ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.