ప్రజాశక్తి -అద్దంకి : మండల పరిధిలోని వెంకటాపురంలో మాగులూరి వారి వివాహ వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసిపి అద్దంకి నియోజక వర్గ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణచైతన్య, వైవి భద్రారెడ్డి పాల్గొని నూతన వధూవరులు అనూషా, నాగఫణింద్ర రెడ్డిని ఆశీర్వదించారు. నూతన దంపతులను ఆశీర్వదించిన వారిలో ఈద శ్రీనివాస్ రెడ్డి, అద్దంకి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, వైసిపి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా అద్దంకి పట్టణంలోని శాంతి అపార్ట్‌మెంట్‌లో తానిపర్తి వారి వివాహ వేడుకలకు హాజరై వరుడు వెంకట రామిరెడ్డిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల పరిధిలోని బొమ్మనంపాడులో గ్రామ వైసిపి నాయకులు కామేపల్లి ఆంజనేయులు మాతమూర్తి కామేపల్లి గోవిందమ్మ దశదిన కర్మలో బాచిన కృష్ణ చైతన్య పాల్గొని గోవిందమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సర్పంచులు, ఎంపిసిటి, వైసిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.










