Nov 02,2023 22:15

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు

ప్రజాశక్తి - పరిగి : ఇటీవలే పరిగి షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోని సర్వేనెంబర్‌ 368/2లోని 3.65ఎకారాల భూమిలో రెవెన్యూ అధికారులు పాతిన రాళ్లను రాత్రికి రాత్రి పగలగొట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటనను సీరియస్‌ గా తీసుకున్న రెవిన్యూ అధికారులు సంఘటనకు పాల్పడిన వ్యక్తులపై తాసిల్దార్‌ సౌజన్య లక్ష్మి ఫిర్యాదుతో 447,427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉందని హెచ్చరిక బోర్డులను నాటారు. అయితే ఈ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని భూ నిర్వాసిత రైతులు ఆరోపిస్తున్నారు.