ప్రజాశక్తి-మేదరమెట్ల: మండలంలోని బొడ్డువానిపాలెం గ్రామంలో వివాదాస్పద స్థలాన్ని, గోడ నిర్మాణాన్ని శుక్రవారం డిపిఒ శంకర్ నాయక్ పరిశీలించారు. వివాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఈ స్థలం విషయమై గొట్టిపాటి సుధారాణి, నేరెళ్ల వెంకటేశ్వర్లు మధ్య వివాదం ఉంది. సీఎం కార్యాలయ దృష్టికి కూడా ఈ సమ స్య వెళ్లింది. జిల్లా అధికారులు కలుగజేసుకుని సుధారాణికి దారి ఇచ్చే విధంగా కోర్టు తీర్పు వచ్చేంతవరకు ఎటువంటి కట్టడాలను నిర్మించకూడదని చెప్పారు. అదే క్రమంలో వెంకటేశ్వర్లు ఆరు మూరల దారి వదిలిపెట్టి గోడను నిర్మించటానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో గొట్టిపాటి సుధారాణి కంప్లైంట్ చేసిన పిదప డిపిఒ శుక్రవారం వచ్చి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దారు ఎల్ లక్ష్మీ నారాయణ, ఈఒఆర్‌డి శ్రీలక్ష్మి, మేదరమెట్ల ఎస్‌ఐ ఎంవి శివకుమార్, స్థానిక పంచాయతీ వీఆర్వో ఆర్ సుబ్బారావు, కార్యదర్శి అనురాధ పాల్గొన్నారు.










