మాట్లాడుతున్న వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి
ప్రజాశక్తి - మంత్రాలయం
వివాదాలకు తావు లేకుండా జరిగే సర్వేలో రైతులు ఉండాలని వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి సూచించారు. శనివారం మండలంలోని 52 బసాపురం గ్రామంలో 'మీ భూమి - మా హామీ' సమగ్ర రీసర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు భూములను సర్వే చేయించే సమయంలో దగ్గర ఉండి హద్దులు చూసుకోవాలని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మండల సర్వేయర్ అబ్దుల్ వాహీద్, సర్వేయర్లు హరికృష్ణ, శేఖర్ నాయక్ ఉన్నారు.










