రామాపురం : పంట సాగు చేసే రైతులు చూసి విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ అన్నారు. బుధవారం మండలంలోని సరస్వతిపల్లి రైతుభరోసా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో సాగుచేస్తున్న పంటలపై దష్టి సారిం చాలన్నారు. పంట వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు, పురుగుమందులు ఎల్లప్పుడూ రైతులకు అందు బాటులో ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రంలోని పలు రికార్డులను పరిశీలించారు. పిఎం కిసాన్ నగదు జమ కావాలంటే తప్పనిసరిగా రైతులు ఇకెవైసి చేయించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి కౌలు రైతుకు కూడా సిసిఆర్‌సి కార్డులు అందాలని సూచించారు. కార్యక్రమంలో మురళీధర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.










