
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు కషి విజ్ఞాన కేంద్రంలో కెవికె అధిపతి డాక్టర్ జి.ప్రసాద్ బాబు సమక్షంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కింద ఎస్‌షి రైతు మహిళలకు భారత ఉద్యాన పరిశోధన స్థానం బెంగుళూరు నుంచి అధిక దిగుబడినిచ్చే 8 రకాల కూగాయలు ఉండే విత్తన కిట్లను బుధవారం అందించి వాటి యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టమాటో, మిరప, అలసంద, పాలకూర, తోటకూర, బీన్స్, వంగ, ఫ్రెంచ్ బీన్స్ వంటి కూరగాయల విత్తనాలు అందించి వీటిని పెరటిలో పెంచుకొని వారి కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ, మిగిలిన వాటిని ఇతరులకు అమ్ముకొని తద్వారా ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా, పోషణ పరంగా స్వయం సమద్ధి సాధించుకోవాలని సూచించారు. జిల్లా ప్రకతి వ్యవసాయం అధికారిని సుభాషిణి మాట్లుడుతూ మహిళలు కూరగాయల విత్తనాలను ప్రకతి వ్యవసాయంలో పండించే విధానాలను తెలిపారు. అభ్యుదయ రైతుల అనుభవాలను ఇతర రైతులతో పంచుకున్నారు. రైతులతో శాస్త్రవేత్తల ముఖా ముఖి నిర్వహించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. పోగాకు పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ అనురాధ, డాక్టర్ గంగాధర్, కెవికె సిబ్బంది దీప్తి, ఆశ్విని, జ్యోతిర్మయి పాల్గొన్నారు.