Aug 17,2023 20:44

విత్తనాల కిట్లు పంపిణి చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :ప్రకతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి దళిత రైతులకు విత్తనాలను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసినట్లు మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకారావు మాదిగ తెలిపారు. కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ఆవరణలో గురుóవారం దళిత రైతులకు రూ. 10 వేల విలువచేసే విత్తనాల కిట్లను అందజేశారు. ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సెక్రటరీ శ్రీనివాసరావు. ప్రకతి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.