
అవగాహన కల్పిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :వరిలో విత్తన శుద్ధిని పాటించడం వల్ల నాణ్యమైన దిగుబడి సాధించొచ్చని జిల్లా వనరుల కేంద్రం ఎడిఎ మారుతీదేవి పేర్కొన్నారు. శుక్రవారం తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం, పోట్లపూడి, ఇస్కపాలెం రైతు భరోసా కేంద్రాలలో రబీ సీజన్ ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం జరిగింది. ఎంఎఒ వివి శిరీష రాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎడిఎ మారుతీ దేవి, ఎఒలు శైలజ, మధురిమ పాల్గొన్నారు. మారుతీ దేవి మాట్లాడుతూ రబీలో సాగు చేస్తున్న పంటలకు విత్తన శుద్ధి చేసి సస్య రక్షణ చర్య లతో యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు.ఇస్కపాలెం, వెంకన్నపాలెం విఎఏలు ఎస్డి. షర్మిల, ఎస్. ఝాన్సీ ఉన్నారు.