Jul 03,2023 19:38

వితన షాపులను తనిఖీ చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
గోనెగండ్లలోని విత్తన దుకాణాల్లో ఎమ్మిగనూరు ఎడిఎ మహ్మద్‌ ఖాద్రీ, గోనెగండ్ల ఎఒ జి.హేమలత సోమవారం తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.10 లక్షల విలువ చేసే పత్తి, సజ్జ, కంది, మిరప విత్తనాలకు సంబంధించిన సోర్స్‌ సర్టిఫికెట్‌ లేకపోవడంతో వాటి అమ్మకాలను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వివిధ షాపుల్లో తనిఖీలు నిర్వహించి కిరణ్‌ హైబ్రిడ్‌ సీడ్స్‌ దుకాణంలో రూ.1,65,753, శ్రీభవాని ట్రేడర్స్‌లో రూ.4,17,250, లక్ష్మీనరసింహస్వామిలో రూ.4,08,592, జై కిసాన్‌ సీడ్స్‌ పెస్టిసైడ్స్‌లో రూ.63,975 విలువ చేసే వివిధ రకాల విత్తనాల అమ్మకాలను నిలిపివేసినట్లు తెలిపారు. సరైన పత్రాలు సమర్పించే వరకు స్టాప్‌ సేల్‌ విధించి అమ్మకాలు నిలిపినట్లు చెప్పారు. విత్తనాలను ఎంఆర్‌పి కంటే అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు ప్రతినెలా 5లోపు క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని అన్నారు.