Nov 05,2023 21:30

ఎపి సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ కె,జగదీష్‌ వెల్లడి

కడప ప్రతినిధి : నాణ్యమైన విత్తన సరఫరా చేయడానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి యేటా ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన పొలాల నుంచి వేరుశనగ, ప్రొద్దు తిరుగుడు, బుడ్డశనగ, పచ్చిరొట్ట విత్తనాలు వంటి పలు పంటలకు సంబం ధించిన నాణ్యమైన విత్తనాన్ని సేకరించడం తెలిసిందే. ఇందులోభాగంగా ఈయేడాది కర్నూలు జిల్లా నుంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరించాం. బుడ్డశనగ విత్తనాన్ని 40 సబ్సిడీతో ఆర్‌బికెల ద్వారా రైతాంగానికి అంద జేస్తున్నాం. ఎపిసీడ్స్‌ మార్కెట్లో ఉన్న కారణంగా బయటి మార్కెట్లో ధరలు స్థిరంగా కొనసాగుతాయని, లేని పక్షంలో ధరలు అమాంతంగా పెరిగే అవ కాశాలు ఉన్నాయి. ఎపిసీడ్స్‌ కొనుగోళ్ల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీ కరణ కొనసాగుతుందని ఘంటాపథంగా చెప్పవ చ్చనడంలో సందేహం లేదని పేర్కొంటున్న ఎపి సీడ్స్‌ మేనే జర్‌ కె. జగదీష్‌తో ముఖాముఖి..
విత్తన కొనుగోళ్ల గురించి తెలపండి?
కర్నూలు జిల్లాలో ఎంపిక చేసిన పొలాల నుంచి సరసమైన ధర ప్రాతిపదికన రైతుల నుంచి విత్తనాన్ని సేకరించాం. ఈఏడాది కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో 70 వేల క్వింటాళ్ల ఎపి సీడ్స్‌ మార్కెట్‌ ప్రవేశం కార ణంగా బహిరంగ మార్కెట్లో ధరలు అదుపులో ఉండటాన్ని ప్రత్యక్షంగా గమనించొచ్చు.
ప్రొక్యూర్‌మెంట్‌ గురించి చెప్పండి?
విత్తన సేకరణకు సంబంధించి టెండర్లు పిలుస్తాం. ఇందులో అర్హత కలిగిన కంపెనీని ఎపిసీడ్స్‌ రాష్ట్ర ఉన్న తాధికారులు ఎంపిక చేస్తారు. ఈఏడాది వరద, వీర భద్ర, వెంకటసాయిలకీë, విఘ్నేశ్వర, గంగాధర అగ్రి టెక్‌, సుబ్రమణ్యేశ్వర, వెంకటే శ్వర ఏజెన్సీలు దక్కిం చుకున్నాయి. రెండు, మూడు విడతల్లో ల్యాబ్‌ టెస్టింగ్‌ అనంతరం నాణ్యతను నిర్ధారిం చడం జరుగుతుంది.
విత్తన నాణ్యత నిర్ధారణ ఎలా?
ప్రభుత్వ నిబంధనల మేరకు టెస్టింగ్‌, స్క్రీనింగ్‌, ఆస్పెక్టెడ్‌ వంటి సదుపాయాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయడం జరుగుతుంది. అనంతరం అగ్రి ల్యాబ్‌ల్లో పరిశీలన చేసిన అనంతరం పంపిణీ చేస్తాం.
విత్తన సరఫరా గురించి తెలపండి?
కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని ఆర్బీకేలకు టెం డరు దక్కించుకున్న ఏజెన్సీలు తమ వాహనాల ద్వారా సరఫరా చేయడం జరుగుతోంది. గతేడాది నుంచి కడప జిల్లాలో 280 ఆర్బీకేలు, అన్న మయ్య జిల్లాలో 3 90 ఆర్బీకేలకు సరఫరా చేయడం పరిపాటిగా మారింది.
సబ్సిడీ తగ్గుదలకు కారణమేమిటి?
విత్తన సబ్సిడీ హెచ్చుతగ్గులు ప్రభుత్వ పరిధిలోని అంశం. ఈయేడాది 40 శాతం సబ్సిడీతో బుడ్డశనగ, సబ్సిడీతో పచ్చిరొట్ట నువ్వుల విత్తనం సబ్సిడీలతో అందజేస్తున్నాం.