ప్రజాశక్తి - కోసిగి
కోసిగిలోని కిరణ్ హైబ్రిడ్స్, కోరమాండల్, వాసవీ ట్రేడర్స్, మంజునాథ ట్రేడర్స్, శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్, కిసాన్ మాల్, లక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్ దుకాణాల్లో గురువారం సీడ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేపట్టారు. విత్తన దుకాణాల్లో రికార్డులను పరిశీలన చేసి తనిఖీ చేశారు. దుకాణాల్లో ఉన్న విత్తనాల నిల్వ వివరాలను, ఎరువులు, పురుగు మందులను పరిశీలించారు. విత్తనాలకు సంబంధించిన బిల్లు బుక్కులను, డెలివరి చలానాలను, మార్కెటింగ్ అగ్రిమెంట్, వచ్చిన స్టాక్, అమ్మిన స్టాక్ వాటి లెక్కలను గమనించారు. ఈ సందర్భంగా ఎడిఎ సంధ్య రాణి మాట్లాడారు. విత్తనాలు అమ్మే డీలర్లకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. కొరమాండల్ దుకాణంలో బిల్ బుక్ మెయింటనెన్స్ చేయకపోవడం వల్ల రూ.6.7 లక్షల విలువ గల విత్తనాలకు స్టాఫ్ సేల్ ఇచ్చినట్లు తెలిపారు. ఎఒ రామకృష్ణ, కోసిగి ఎఒ కె.రాజు పాల్గొన్నారు.
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు










