Jul 15,2023 01:35
విత్తన దుకాణాలను తనిఖీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-నగరం: మండలంలోని పెదపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి వేమూరి రమేష్‌బాబు వ్యవసాయ విస్తరణ అధికారి నాగ శ్రీనివాసరావుతో కలిసి విత్తనాల దుకాణాలు తనిఖీ చేశారు. ప్రతి ఒక్క రైతు విత్తనాలను లైసెన్సు ఉన్న డీలర్‌ దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలని, బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని, తీసుకున్న బిల్లు పంట కాలం పూర్తి అయ్యే వర కు జాగ్రత్తగా భద్ర పరుచుకోవాలని సూచించా రు. తద్వారా విత్తనాల ద్వారా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడా నికి ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా మండలంలోని రైతులు అందరూ పిఎం కిసాన్‌ పథకానికి సంబంధించి ఇకెవైసి ప్రతి ఒక్క రైతు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పిఎం కిసాన్‌ పథకానికి అర్హులైన రైతులందరూ, నగదు జమ అవుతున్న రైతులందరూ నిత్యం కిసాన్‌ పథకానికి సంబం ధించిన నగదు జమ కావాలంటే ఈ నెల 31వ తేదీ లోపు అందుబాటులో ఉన్న గ్రామ సచివా లయం, మీ సేవ, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో మీ పొలం పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డ్‌, బ్యాంక్‌ అకౌంట్‌ జిరాక్స్‌ కాపీలు మీ ఆధార్‌కు లింక్‌ అయివున్న మొబైల్‌ నెంబర్‌ తీసుకుని వెళ్లి ఇకెవైసి తప్పని సరిగా చేయించుకోవాలని అన్నారు.