విట్స్‌లో సిపిఆర్‌పై అవగాహన
ప్రజాశక్తి - కావలి : స్థానిక విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఐ.జె.మధుకర్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జె.కృష్ణచైతన్య ''గుండెపోటు వచ్చిన వ్యక్తికి సత్వరమే స్థానికంగా ఏయే విధాలైన ప్రధమ చికిత్సలు చేయవచ్చో, అంబులెన్స్ వచ్చేలోగా ఎలా బతికించుకోవచ్చో తెలియజేసి, సిపిఆర్ చేసే పద్ధతిని వివరించారు. మోడల్ బొమ్మలతో సిపిఆర్ చేసేపద్ధతిని విద్యార్థులతో చేయించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులు ఈ విధానాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమానికి మెడికవర్ మార్కెటింగ్ అసోసియేట్లు సురేష్‌కుమార్, ప్రసన్నకుమార్, కళాశాల సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించడంపై కళాశాల చైర్మన్ దొడ్ల విద్యాధర్‌కుమార్‌రెడ్డి, అకడమిక్ డైరక్టర్ డాక్టర్ ప్రత్యూషారెడ్డి తమ సంతోషం వ్యక్తం చేశారు.










