Sep 20,2023 23:57

ప్రజాశక్తి - భట్టిప్రోలు
ప్రధాని విశ్వకర్మ యోజన పథకంకు లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్‌సి)లో నమోదు చేసుకోవాలని ఎంపీపీ డివి లలిత కుమారి తెలిపారు. వేమూరు కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు కోడూరు వెంకటేశ్వరరావు కామన్ సర్వీస్ సెంటర్‌లో నమోదు చేసుకోగా అందిన వివరాలను ఎంపీపీ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామన్ సర్వీస్ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అనంతరం ఐదు రోజులపాటు శిక్షణ తీసుకుంటే ధ్రువీకరణ పత్రం, ఐడి కార్డు ఇస్తారని తెలిపారు. వీటితో బ్యాంకుకు వెళితే రూ.2లక్షలు రుణం అందిస్తారని చెప్పారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఎకౌంటు, ఆధార్‌కు లింకైన ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల ఆధార్లు, ఈ శ్రమ కార్డు ఉండాల్సి ఉందన్నారు. చేతివృత్తుల వారు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుమ్మ చంద్రశేఖర్, ఏవో శైలజ, నాయకులు మల్లేశ్వరరావు ఉన్నారు.