Sep 17,2023 21:09

విశ్వకర్మ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జిల్లా బిసి సంక్షేమాధికారి యశోదనరావు, తదితరులు

ప్రజాశక్తి-విజయనగరం : విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. బిసి సంక్షేమ అధికారి యశోదన రావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జాన వెంకట వరప్రసాద్‌, జిల్లా అధ్యక్షులు కిల్లంపల్లి ఆచారి, ఉపాధ్యక్షులు ఈశ్వరరావు.. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
విజయనగరం టౌన్‌ : స్థానిక రామారాయుడు రోడ్‌లో నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాలలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నాలుగో డివిజన్లో బధిర పాఠశాల ప్రాంతంలో విశ్వకర్మ జయంతి వేడుకలలో కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్‌ కౌశిక్‌ పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వనరులను అందజేశారు.కార్యక్రమంలో కార్పొరేటర్‌ మారోజు శ్రీనివాసరావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనాప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.