Jul 30,2023 22:03

విశ్వబ్రాహ్మణుల సంఘం నాయకులతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం టిడిపి స్థానిక కార్యాలయంలో నియోజకవర్గ విశ్వబ్రాహ్మణుల సంఘాల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పల్లె రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం లో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు పంపిణీతో పాటు విరివిగా రుణాలు అందించడం జరిగిందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్ళు గడిచిన చేతి వృత్తుల వారిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ ప్రభుత్వంలో అరాచకాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, ఇసుక మట్టి దోపిడీలతో ప్రజలు విసిగిపోయారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే చేతివృత్తుల వారి అభివృద్ధికి, సంక్షేమానికి కషి చేస్తామన్నారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు డంకనాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సమస్యలపై పనిచేస్తున్నామని, 2024 ఎన్నికలలో టిడిపి విజయానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ సూర్యనారాయణ, బీసీ సెల్‌ అధ్యక్షులు రంగయ్య, నాయకులు ఆనందాచారి, రామాంజనేయులు, గురు ప్రసాద్‌ ఆచారి తదితరులు పాల్గొన్నారు.