Aug 24,2023 21:48

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

* స్పీకర్‌ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస: 
చంద్రయాన్‌-3 విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలకు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అభినందనలు తెలిపారు. 140 కోట్ల భారతీయ ప్రజానీకం ఆకాంక్షలు నెరవేరాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ చరిత్ర పేజీల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన దినంగా కొనియాడారు. భారతదేశానికి ఇంతటి ఘనకీర్తి తెచ్చిన ఇస్రో శాస్త్రవేత్తలు భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శాస్త్రవేత్తలకు అవసరమైన వనరులు సమకూర్చడంతోపాటు తగిన ప్రోత్సాహం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతదేశంలో మేధావులు, విజ్ఞానవంతులకు కొదవలేదని ప్రపంచానికి ఈ ఘటనతో నిరూపితమైందన్నారు.