జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
ప్రజాశక్తి -హుకుంపేట: ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా అన్ని గిరిజన గ్రామాల్లో ప్రతిఒక్కరికీ మెరుగైన సేవలను విస్తృతంగా అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని తీగలవలస పంచాయతీలో నిర్వహిస్తున్న ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్యశిబిరం,104 వాహన సేవలను ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్బంగా మాట్లాడతూ, ఫ్యామిలీ ఫిజీషియన్, 104 వైద్యసేవలపై గిరిజనులందరికీ అవగాహన కల్పించాలన్నారు హైపర్ టెన్షన్ నివారణకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. గర్భిణులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతోపాటు ఆసుపత్రి డెలివరీల ద్వారా మాతాశిశుసంరక్షణపై వారిని చైతన్యపరచాలని ఆదేశించారు. 104 వాహనంలో గర్భిణులకు వైద్యసేవలు అనంతరం, ఆయా గ్రామాల్లోని హాస్టల్స్, అంగన్వాడీలు, పాఠశాలలను సందర్శించి వైద్యసేవలు అందించాలని సూచించారు.
అనంతరం తీగలవలస అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలోని సరుకుల నిల్వలను పరిశీలించారు. నిల్వల వివరాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీలకు రాలేని లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పోషకాహారం అందించాలని సూచించారు. ఓలుబెడ్డలో ఆశావర్కర్‌ను నియమించాలని స్థానికులు కోరగా, జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
పిహెచ్‌సి నిర్వహణపై అసంతప్తి
ఆతరువాత హుకుంపేట పిహెచ్‌సిని తనిఖీ చేసారు. ల్యాబొరేటరీ, వార్డులను, వెయిటింగ్ హాల్‌ను పరిశీలించి అసంతప్తి వ్యక్తం చేసారు. అందుబాటులో ఉన్న ఆసుపత్రి అభివృద్ధి నిధులు రూ.1.50లక్షలతో బర్త్ వెయిటింగ్ హాల్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలని, ఆసుపత్రికి అవసరమైన మందులు బెడ్‌షీట్లు, వైద్యపరికరాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తాహశీల్దార్ రాజ్యలక్ష్మి , సిడిపిఒ మణిదేవి పాల్గొన్నారు.










