ప్రజాశక్తి-సీలేరు
మావోయిస్టు పార్టీ పిఎల్‌జిఎ వారోత్సవాలు సందర్భంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు కంచుకోటగా ఉన్న ఏవోబిలో జల్లెడ పడుతున్నారు. పోలీసులు లక్ష్యంగా చేసుకొని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవచ్చని ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని మల్కనగిరి జిల్లా పోలీసు బలగాలు పప్పులూరు, కురమనూరు, కలిమేల బ్లాక్, నాగులూరు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. వారోత్సవాలు నేపథ్యంలో పోలీసు కూంబింగ్ ఎక్కువగా ఉండటంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
కొయ్యూరు : మావోయిస్టు పార్టీ పిఎల్‌జిఎ వారోత్సవాలు తరుణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏరియా డామినేషన్ ప్రోగ్రామ్స్ వాహనాల తనఖీలు చేపట్టారు. మంప ఎస్‌ఐ లోకేష్ ఆధ్వర్యాన భద్రత చర్యల్లో భాగంగా చిడిపాలెం నుండి బూదరాళ్ల వరకు తనిఖీలు చేశారు.










