ప్రజాశక్తి-సంతమాగులూరు: ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, శనివారం సంతమాగులూరులోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పల్నాడు జిల్లా ప్రజా సంఘాల నాయకులు, ఆయా కార్యాలయాల సిబ్బందికి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, శాసనమండలిలో ప్రజల గొంతుక వినిపించే పిడిఎఫ్ అభ్యర్థులైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పి బాబురెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు ద్వారా ఓటర్స్‌ను అభ్యర్థించారు. ప్రభుత్వ కార్యాలయాలు అయిన ఐసిడిఎస్, వెలుగు, ఉపాధి హామీ, రెవెన్యూ, మండల పరిషత్, విద్యావనరుల కార్యాలయాలను సంప్రదించి ఓటర్లకు కరపత్రాలు అందజేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రజా సంఘాల నాయకులు టీ పెద్దిరాజు, జి మల్లేశ్వరి, టి శ్రీనివాసరావు, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










