
ప్రజాశక్తి - భీమవరం
రాజీవ్ గాంధీ జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును అందుకున్న విస్సాకోడేరు గ్రామ సర్పంచి బి.శ్రీనివాస్‌ను కలెక్టర్ పి.ప్రశాంతి అభినందించారు. స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రశాంతిని విస్సాకోడేరు గ్రామ సర్పంచి బి.శ్రీనివాసరావు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా సర్పంచి శ్రీనివాస్‌ను కలెక్టర్ ప్రశాంతి ప్రత్యేకంగా అభినందించారు. విస్సాకోడేరు గ్రామ పంచాయతీని శానిటేషన్ రంగంలో అందరికీ ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దినందుకు రాజీవ్‌గాంధీ నేషనల్ అవార్డు కోసం జిల్లా యంత్రాంగం నుంచి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రతిపాదనల పరిశీలన అనంతరం గ్రామాన్ని రాజీవ్‌గాంధీ నేషనల్ బెస్ట్ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపిక చేశారన్నారు. అవార్డును ఆగస్టు 19న బెంగళూరులోని గాంధీభవన్‌లో అకాడమీ ఆఫ్ గ్రాస్ రూట్స్ స్టడీస్, రీసెర్చ్ ఆఫ్ ఇండియా వారి చేతుల మీదుగా సర్పంచి శ్రీనివాస్ అందుకున్నారన్నారు. జిల్లా పంచాయతీ శాఖాధికారి జివికె.మల్లికార్జునరావు, డిపిఆర్‌సి ఎన్.ఎడ్వర్డ్, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ ఉన్నారు.