
ప్రజాశక్తి - చాగల్లు మండల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశం శనివారం అంబేద్కర్ రీడింగ్ భవనంలో సంఘం అధ్యక్షులు కోడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో లైప్ సర్టిపికేట్స్ సంబంధిత ట్రజరీల్లో అందజేయాలని తెలిపారు. సమావేశంలో సభ్యుల జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సమావేశంలో డి.నాగేశ్వరరావు, కెఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు..