Aug 21,2022 22:35

మాట్లాడుతున్న కార్పొరేటర్‌ వావిలపల్లి ప్రసాద్‌

ప్రజాశక్తి -మాధవధార : విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయమని 50వ వార్డు కార్పొరేటర్‌ వావిలపల్లి ప్రసాద్‌ పేర్కొన్నారు. మాధవధార రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 37వ వార్షికోత్సవం మాధవధారలోని భరద్వాజ క్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్‌ వావిలపల్లి ప్రసాద్‌ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విరమణ అనంతరం ఇళ్లకే పరిమితమైన రోజుల్లో రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు 37 ఏళ్ల పాటు సంఘాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కరోనాతో 30 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులను కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. ఆయా కుటుంబాలను రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆదుకునేందుకు చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. రిటైర్డ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సనపల రామ్‌ గోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి వైవి సత్యనారాయణ, గాయత్రి విద్యా మందిర్‌ కరస్పాండెంట్‌ సనపల జగదీశ్వరరావు, మాధవ యువజన సమాజం సహాయ కన్వీనర్‌ పప్పల రామచంద్రరావు, కూన సత్యనారాయణ, వావిలపల్లి వెంకట రావు, సనపల శంకరరావు, పేడాడ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
ఈ సందర్భంగా మాధవధార రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సనపల రామ్‌గోపాల్‌రావు, ఉపాధ్యక్షులుగా పప్పల రామచంద్రరావు, కార్యదర్శిగా అన్నపు ఈశ్వరరావు, సహాయ కార్యదర్శిగా చౌదరి సూర్యనారాయణ, కోశాధికారిగా మూల మొగ్గారావు, కమిటీ సభ్యులుగా కంచరాన మోహన రావు, సనపల సీతారాం, సనపల త్రినాధస్వామి, పేడాడ పాండురంగారావు, బొడ్డేపల్లి త్రినాధస్వామి, ఎస్‌టివి.రమణమూర్తి, భగవతి శ్రీరామమూర్తి ఎన్నికయ్యారు.