
చెక్కును అందజేస్తున్న ఎస్‌పి రాధిక
ప్రజాశక్తి- శ్రీకాకుళం: సహాద్యోగుల ఒక్కరోజు గౌరవ వేతనం చెక్కును విశ్రాంత హోమ్‌గార్డుకు జిల్లా ఎస్‌పి జిఆర్.రాధిక అందజేశారు. జూన్‌నెలలో ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు కె.త్రినాథరావుకు జిల్లాలో పని చేస్తున్న హోంగార్డులు స్వతహాగా విరాళంగా ఇచ్చిన ఒకరోజు వేతన మొత్తం రూ.4.21 లక్షల నగదు చెక్కు రూపంలో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ముందుంటుందని, ఎల్లవేళల మీకుతోడుగా ఉంటుందని హామీ ఇస్తూ, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ కెవి నర్సింగరావు ఉన్నారు.