Feb 07,2022 11:15

విశాఖ : కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ.. నేడు చలో కలెక్టరేట్‌కు సిఐటియు పిలుపునిచ్చిన నేపథ్యంలో... పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. విశాఖ జివిఎంసి కాంట్రాక్టు వర్క్స్‌ యూనియన్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి ముద్దాడి వరప్రసాద్‌ రావు ను ఉదయం 9 :20 నిమిషాలకు పోలీసులు గృహనిర్బంధం చేశారు. నేడు తలపెట్టిన జీవో ప్రతుల దగ్ధం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డగించారు. ఆర్‌టిసి యూనియన్‌ నాయకులు బి.తులసి రావును ముందస్తు అరెస్టు చేశారు.