ప్రజాశక్తి-విశాఖపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి జగనోన్మహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించే అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖ విమానాశ్రయానికి ఉదయం 9.10 గంటలకు చేరుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీలు విజయసాయి రెడ్డి, ఎంవివి.సత్యనారాయణ, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ, జివిఎంసి కమిషనర్ సాయికాంత్‌వర్మ, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్‌రాజు, జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాథన్, ఆర్‌డిఒ హుస్సేన్ సాహెబ్ తదితరులు ముఖ్యమంత్రికి పుష్ప గుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో 9.20 గంటలకు పార్వతీపురం-మన్యం జిల్లాకు బయలుదేరి వెళ్లారు.










