May 03,2023 23:12

ధర్నా చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి - కాకినాడ
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ప్రధాన పోస్టల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్వరరావులు మాట్లాడారు. మూడు లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు పరిశ్రమను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు 9,000 కోట్లకు అమ్మాలని చేసిన నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. 32 మంది బలిదానాలతో, 62 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలతో, 30 గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ భూమిని త్యాగం చేస్తే విశాఖ ఉక్కును పోరాడి సాధించుకున్నామని తెలిపారు. 30 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే నవరత్న హోదా కలిగిన విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని ప్రతిజ్ఞబునారు.
మోడీ ప్రభుత్వం దేశ ప్రజల సంపదతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా అమ్మేస్తూ నకిలీ దేశభక్తిని ప్రచారం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 13 లక్షల పోస్టులు ఖాళీలు ఉండగా, ఉద్యోగాల కోసం ఎదురుచూసే చదువుకున్న నిరుద్యోగు లకు ఈ ప్రైవేటీకరణ విధానం శాపంగా మారిందన్నారు. రెండు సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు గేటు వద్ద కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాల ఫలితంగానే నేటికీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయలేకపోతున్నారని, ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు, మేధావులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మరింత ఉధృతం చేస్తేనే విశాఖ ఉక్కును కాపాడు కోగలుగుతామని తెలిపారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మా పని అయిపోయిందని చేతులు దులుపుకోవడం కాకుండా, పోరాడుతున్న ప్రజా సంఘాలతో, కార్మిక సంఘాలతో కలిసి రావాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, కోశాధికారి మలకా రమణ, నగర అధ్యక్ష, ఉపాధ్యక్షులు పలివేల వీరబాబు, మెడిశెట్టి వెంకటరమణ, ఆఫీస్‌ కార్యదర్శి రాణి, అమత, పెన్షనర్స్‌ అసోసి యేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచరపు సత్తిరాజు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఎస్‌.నిర్మల, స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నాయకులు రాజా, వరహాలు, సాహిత్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి కమిరెడ్డి బోరకొండ, ఏఐటియుసి నాయ కులు పెడిరెడ్ల సత్య నారాయణ, కేశవరావు, అప్పలరాజు, మహిళ సమాఖ్య కార్యదర్శి జి.లోవరత్నం, పప్పు ఆది నారాయణ, ఎం.సత్యనా రాయణ, కాశీ విశ్వనాధ్‌, సూరి బాబు, టిఎన్‌టియుసి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్రి రాజారావు, నాయకులు బురయ్య, ఎం.బాబూరావు, శ్రీను, వీరబాబు, సురేష్‌, నగర కార్యదర్శి గంగాధర్‌, ఐఎఫ్‌టియు నాయకులు భైరవస్వామి, బంగారు సత్యనారాయణ, వి.మనోజ్‌, ఆర్‌.నాగేశ్వరరావు, జి.దురా ్గరావు, రామకృష్ణ, ఏవి.రమణ, ఎఐసిసిటియు నాయకులు నరసరాజు పాల్గొన్నారు.