విశాఖ ఉక్కును కార్పొరేట్ రాబందులకు కట్టబెట్టే కేంద్ర వైఖరి తిప్పికొడదాం - సిపిఎం
విశాఖ ఉక్కును కార్పొరేట్ రాబందులకు కట్టబెట్టే కేంద్ర వైఖరి తిప్పికొడదాం - సిపిఎం
ప్రజాశక్తి-డోన్
రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటి విశాఖ ఉక్కును ఆదానికో, జిందాల్ కో మరో కార్పొరేట్ రాబాందుకో కట్టబెట్టడానికి కేంద్రం కుట్ర చేస్తుందని అలాంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కలిసి తిప్పి కొట్టడానికి సిద్ధం కావాలని సిపిఎం పట్టణ మండల కార్యదర్శి నక్కి శ్రీకాంత్,కే.నాగరాజు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని తారక రామ నగర్ నందు సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార బేరి పాదయాత్ర మూడవరోజు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రజా వ్యతిరేక మతోన్మాద బిజెపిని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ మన రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు అని ప్రత్యేక హోదా,పోలవరం ప్రాజెక్టు నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవన్నీ పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్క దానిని అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలోని బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను దోచుకోవడం తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేయ్య లేకపోయింది,అందుకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకొని పోయి ఎండగట్టడానికి ఈ యొక్క ప్రచార భేరి పాదయాత్రలు చేపడుతున్నామని అన్నారు.బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానాలను ప్రజలకు తెలియజేయాలి,ఆర్థిక విధానాలు అధిక ధరలు, నిరుద్యోగం,ప్రైవేటీకరణ,జీఎస్టీ బారాలు ఇవన్నీ ప్రజల మీద విలయతాండవం చేస్తున్నాయని ఈ విధానాల వల్ల సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితుల్లో కనబడడం లేదని,అందుకే బిజెపి దేశానికి రాష్ట్రానికి ద్రోహం చేస్తుందని అన్నారు.భారతదేశంలో రాఫెల్ ఆదాని కుంభకోణం అదేవిధంగా రాజ్యాంగం పై దాడి జరుగుతుందని ప్రజల్లోకి తీసుకొనిపోతున్నామని తెలిపారు.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వీటన్నిటి పైన సీపీఎం పార్టీగా ప్రజలలోకి తీసుకొని పోయి ఎండగట్టుతామన్నారు.అంతేకాక పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ద్వారా షరతులు విధించి వివిధ అదనపు భారాలు మోపిందని అన్నారు.విద్యుత్ చార్జీలు పెంపు,చెత్త పన్ను,ఆస్తి పన్ను,వ్యవసాయ మీటర్లకు మోటర్లు బిగించడం ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలను అంగీకరించి ప్రజలకు ద్రోహం చేస్తుందని అన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని, మైనార్టీలపై దాడులు,దళితులపై,గిరిజనులపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని వారన్నారు భారతదేశం మోడీ అమిత్ షా ఆదాని కంపెనీలాగా భారతదేశ మారుతుందని తెలిపారు. కాబట్టి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని అందుకే కేంద్ర ప్రభుత్వ ,ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకుని పోయి దేశాన్ని కాపాడుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తారకరామ నగర్ సీపీఎం కార్యదర్శి అక్బర్ బాషా, శ్రీరామ నగర్ సీపీఎం కార్యదర్శి షేమిమ్ బేగం, డి వై ఎఫ్ ఐ మండల కార్యదర్శి నక్కి హరి,మండల సహాయ కార్యదర్శి శ్రీను, ఐద్వా నాయకురాలు ఉస్సేన్ బీ,సీపీఎం నాయకులు ఏసురత్నం,మాసుం వలి తదితరులు పాల్గొన్నారు.










