
8న విద్యాసంస్థల బంద్ జయప్రదానికి ప్రజాసంఘాల పిలుపు
ప్రజాశక్తి-అమలాపురం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు యువత ఐక్య ఉద్యమాన్ని ఉదృతం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇ.భూషణం పిలుపునిచ్చారు. శనివారం అమలాపురం రవితేజ విద్యాసంస్థల ఆవరణంలో పిడిఎస్‌యు, ఎవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 8న జరుగుతున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ పోస్టర్‌ను భూషణం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరి రక్షణకు ఉద్యమం చేపట్టి ఈనెల 8వతేదీ నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుందన్నారు. కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 8న అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. బందుకు విద్యా సంస్థలు యువకులు సహకరించిజయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో పిడి ఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు, జిల్లా కన్వీనర్ సాపే రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.ప్రణీత్ సాయి, నామాడీ రాజేష్, ఎవైఎఫ్‌ఐ నాయకులు బాలకృష్ణ సురేష్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర పురం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణం వ్యతిరేకిస్తూ ఈ నెల 8న పిడిఎస్‌యు విద్యార్థి సంఘం బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యా సంస్థలు సహకరించాలని కోరింది.